logo

అరాచక ప్రభుత్వాన్ని దించితేనే రాష్ట్రానికి భవిత

నందమూరి తారక రామారావు త్యాగశీలి అని, ప్రజల కోసమే ఆయన తెదేపాను ప్రారంభించారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు.

Updated : 30 Mar 2024 04:50 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న అశోక్‌, ఆయన సతీమణి సునీలా, కుమార్తె అదితి గజపతిరాజు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: నందమూరి తారక రామారావు త్యాగశీలి అని, ప్రజల కోసమే ఆయన తెదేపాను ప్రారంభించారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. శుక్రవారం నగరంలోని బంగ్లాలో పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో జరిగే ఎన్నికలు ప్రజలకు మంచి అవకాశమని, ఈ అరాచక ప్రభుత్వాన్ని దించితేనే రాష్ట్రానికి భవిత ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసే నాయకులను అధికారంలో ఉంచితే భావితరాలు క్షమించవన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలా విఫలం అయ్యారన్నారు. వాలంటీర్లు వారి కార్యకర్తలేనని, వారికి దున్నేయండని పిలుపునివ్వడం సరికాదన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. తన సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె అదితి గజపతిరాజుతో కలిసి జిల్లాతో అనుబంధమున్న మహనీయులను స్మరించి, వారి చిత్రపటాలకు నమస్కరించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన డా.పి.ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఆర్‌.గజపతిరాజు (వైద్య రంగం), పెద్ది లక్ష్మీనారాయణ (వెయిట్‌ లిఫ్టింగ్‌), అబ్దుల్‌ రవూఫ్‌ (రక్తదానం మోటివేటర్‌), డి.రాము (సీనియర్‌ ఎలక్ట్రీషియన్‌), కళ్లేపల్లి భాగ్యలక్ష్మి (బుర్రకథ కళాకారిణి), లంక ఆదినారాయణ (రైతు), జనార్దన్‌ (రక్తదాత), ఇనుగంటి సురేష్‌కుమారి (ప్రముఖ న్యాయవాది)ని సన్మానించి జ్ఞాపికలను అందించారు. ఇటీవల పార్టీ కార్యకర్త పప్పు సంతోష్‌ మృతి చెందగా ఆయన కుటుంబానికి రూ.25 వేల చెక్కు ఇచ్చారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అదితి గజపతిరాజును ఆశీర్వదించాలని అశోక్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని