logo

జనసేన అభ్యర్థిని నాగమాధవికి బి-ఫారం

కూటమి అభ్యర్థినిగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న లోకం నాగమాధవి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేతులమీదుగా బి-ఫారం అందుకున్నారు.

Published : 18 Apr 2024 04:48 IST

పవన్‌కల్యాణ్‌ నుంచి బి-ఫారం అందుకుంటున్న లోకం నాగమాధవి

భోగాపురం, న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థినిగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న లోకం నాగమాధవి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేతులమీదుగా బి-ఫారం అందుకున్నారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ అభ్యర్థులకు ఆయన అందజేశారు. ఈ నెల 23న నాగమాధవి  నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధిష్ఠానం అభ్యర్థినిగా పేరు ప్రకటించిన నాటి నుంచి ఆమె గ్రామాల్లో పర్యటిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నెల్లిమర్లలో జనసేన విజయకేతనం ఎగురవేసేలా కూటమి నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నట్లు నాగమాధవి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని