logo

వైభవం.. రాములోరి కల్యాణం

రెండో భద్రాదిగా విరాజిల్లుతున్న రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముని కల్యాణం వైభవంగా జరిగింది. తిరుపతి, సింహాచలం దేవస్థానాల నుంచి వచ్చిన పట్టువస్త్రాలు,

Published : 18 Apr 2024 04:56 IST

రామతీర్థంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: రెండో భద్రాదిగా విరాజిల్లుతున్న రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముని కల్యాణం వైభవంగా జరిగింది. తిరుపతి, సింహాచలం దేవస్థానాల నుంచి వచ్చిన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ప్రభుత్వం తరఫున ఉత్సవ ప్రత్యేకాధికారి, సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి సమర్పించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై ఉత్సవ విగ్రహాలను ఉంచి ఉదయం 10.30 గంటల నుంచి కల్యాణ క్రతువును అర్చకులు ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం సాగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఝాన్సీ దంపతులు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పద్మావతి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. జేసీ కె.కార్తీక్‌, ఆర్డీవో సూర్యకళ, విశాఖ జిల్లా న్యాయమూర్తి గిరిధర్‌, దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు, డీఎస్పీ ఆర్‌.గోవిందరావు పాల్గొన్నారు.

అశోక్‌ గజపతిరాజుకు ఆశీర్వచనం అందిస్తున్న అర్చకులు

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ఉత్సవాల ప్రత్యేకాధికారి శ్రీనివాసమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని