logo

బ్యాంకు ఖాతాల తనిఖీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందజేసిన సామాజిక పింఛన్ల భృతిని మే, జూన్‌ నెలల్లో బ్యాంకు ఖాతాలలో జమ చేసి నగదును బట్వాడా చేసేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది.

Published : 30 Apr 2024 17:37 IST

బలిజిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందజేసిన సామాజిక పింఛన్ల భృతిని మే, జూన్‌ నెలల్లో బ్యాంకు ఖాతాలలో జమ చేసి నగదును బట్వాడా చేసేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. ఇందుకోసం పింఛనుదారులు తమ బ్యాంకు ఖాతాలు ఎలా ఉన్నాయో అనే అంశంపై బ్యాంకు పాసుపుస్తకాలు తీసుకువచ్చి మంగళవారం బలిజిపేట యూనియన్‌ బ్యాంకు శాఖలో తనిఖీ చేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ బ్యాంకు వద్ద పింఛనుదారులతో రద్దీ ఏర్పడింది. పింఛను కోసం అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాల్సి ఉండటంతో పాత విధానంలోనే పింఛను భృతిని అందించాలని పింఛను దారులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని