logo

ఈ రహదారిపై ప్రయాణం చేసేదెట్టా?

మండలంలోని వంతరాం గ్రామం నుంచి గళావల్లి వరకు వెళ్తున్న రహదారి చాలా చోట్ల గుమ్ములు, గోతులతో నిండి పోయింది.

Updated : 04 May 2024 19:33 IST

బలిజిపేట: మండలంలోని వంతరాం గ్రామం నుంచి గళావల్లి వరకు వెళ్తున్న రహదారి చాలా చోట్ల గుమ్ములు, గోతులతో నిండి పోయింది. పదిహేనేళ్ల కిందట ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన నిధులతో నిర్మించిన తారురోడ్డుపై నేటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టనందున పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రహదారిపై 12 చోట్ల పూర్తిగా రాళ్లుతేలాడుతూ గోతులతో దర్శనమిస్తోంది. ఈ మార్గంలో ద్విచక్రవాహనాలు, భారీ వాహనాలు ఈ రోడ్డును దాటేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిలో తెర్లాం, బలిజిపేట, రాజాం, వంగర మండలాలకు చెందిన 20 గ్రామాల ప్రజలు నిత్యం వెళ్లి వస్తుంటారు. ఈ రోడ్డు అధ్వాన పరిస్థితుల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఈ విషయంపై రోడ్లు, భవనాలశాఖ జేఈ జయరాజును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని