logo

తెదేపా విజయం ఖాయం

రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని గజపతినగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

Published : 05 May 2024 04:58 IST

మరడాం సభలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌
దత్తిరాజేరు, గుర్ల, సంతకవిటి, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని గజపతినగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దత్తిరాజేరులోని ఇంగిలాపల్లి, కె.కృష్ణాపురం, మరడాం గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రశేఖర్‌, ఈశ్వరరావు, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ః గుర్ల మండలం వల్లాపురంలో ఉపాధి వేతనదారులకు తెదేపా బీసీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నె సన్యాసినాయుడు, టి.కిరణ్‌కుమార్‌, మహేశ్వరరావు, రమేష్‌రాజు ‘సూపర్‌-6’ పథకాలను వివరించారు. ః సంతకవిటి మండలం కేఆర్‌ పురం, కొండగూడెం తదితర గ్రామాల్లో రాజాం అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌, కొల్ల అప్పలనాయుడు, గట్టిభాను తదితరులు ప్రచారం చేపట్టారు.

మెంటాడలో ప్రచార రథంపై సంధ్యారాణి తదితరులు

చంద్రబాబుతోనే ఉపాధి

 మెంటాడ(గజపతినగరం), బొబ్బిలి గ్రామీణం, రామభద్రపురం, బాడంగి: అయిదేళ్లుగా సీఎం జగన్‌ యువతకు ఉపాధి లేకుండా చేశారని, ఉద్యోగావకాశాలు పెరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని సాలూరు కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కుంటినవలస, చామలాపల్లి తదితర  గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొబ్బిలి పట్టణ పరిధి గొల్లపల్లిలోని 10, 11, 12 వార్డుల్లో కూటమి అభ్యర్థి బేబినాయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. 16 వార్డు మాజీ కౌన్సిలర్‌ సిద్ధాంతపు శ్రీనివాసరావు, ఏడో వార్డుకు చెందిన దిబ్బ లోకేష్‌, సారధితోపాటు పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ః ఇట్లామామిడిపల్లి గ్రామానికి చెందిన 25 కుటుంబాలు కరణం భాస్కరరావు ఆధ్వర్యంలో వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. ః బాడంగి మండలం పూడివలస, పాల్తేరు గ్రామాల్లో తెదేపా జిల్లా బీసీ సాధికారత కన్వీనర్‌ కొల్లి అప్పలనాయుడు, రామభద్రపురంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని