logo

రాత్రికి రాత్రే ఇళ్లపై జగన్‌ స్టిక్కర్లు

మండలంలోని బూడిపేట గ్రామంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే కొన్ని ఇళ్లపై జగనన్న స్టిక్కర్లు అతికించారు.

Published : 09 May 2024 03:21 IST

అంగన్‌వాడీ కేంద్రం భవనంపై జగన్‌ బొమ్మ

గజపతినగరం, న్యూస్‌టుడే: మండలంలోని బూడిపేట గ్రామంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే కొన్ని ఇళ్లపై జగనన్న స్టిక్కర్లు అతికించారు. అంగన్‌వాడీ కేంద్రం భవనంపై కూడా అతికించడంతో ఉదయం 10 గంటలకు చూసిన నిర్వాహకురాలు సత్యవతి స్టిక్కరును తీయించేశారు. ఇళ్లపై స్టిక్కర్లు అతికించడంపై స్థానికులు పంచాయతీ అధికారులకు తెలియజేశారు. గ్రామంలో చాలా ఇళ్లపై ఇలానే ఉన్నాయి. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని,  తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ‘న్యూస్‌టుడే’తో అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని