logo

ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి

ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్‌ శాతం పెంపునకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా పిలుపునిచ్చారు.

Published : 09 May 2024 04:14 IST

ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్న అధికారులు, నగరవాసులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్‌ శాతం పెంపునకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా పిలుపునిచ్చారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద సహాయక కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆర్‌అండ్‌బీ కూడలి, మయూరి కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్‌, అంబేడ్కర్‌ కూడలి, కోట, మూడులాంతర్లు, గంటస్తంభం మీదుగా రాజీవ్‌ క్రీడా మైదానం వరకు సాగింది. ఇక్కడ మానవహారం నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. వివిధ శాఖల అధికారులు శ్రీనివాసరావు, సత్యప్రసాద్‌, పి.బాలాజీ, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్‌, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని