logo

సమన్వయంతో ఎన్నికల నిర్వహణ

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆర్వో, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 09 May 2024 04:17 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, చిత్రంలో ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆర్వో, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం పార్వతీపురం కలెక్టరేట్‌ నుంచి రెండు జిల్లాల అధికారులతో దూరదృశ్య శ్రవణ సమావేశం నిర్వహించారు. పోలింగ్‌కు సంబంధించి సామగ్రి పంపిణీ, రవాణా, రూట్లు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. ఎక్కడా లోపాలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు ప్రమోద్‌కుమార్‌ మెహర్ద, నయీం ముస్తఫా మన్సూరీ, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఇన్‌ఛార్జి డీఆర్వో కేశవనాయుడు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జి సూర్యనారాయణ, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

లెక్కింపు కేంద్రంలో పరిశీలన..

ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ పరిశీలించారు. ఈవీఎంలు అప్పగించే కేంద్రం, రిసెప్షన్‌ సెంటరు ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌, లెక్కింపు, కంట్రోల్‌ గదులు, మీడియా సెంటర్లలో చేయాల్సిన పనులపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని