logo

విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

వైద్య, ఆరోగ్యశాఖ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డి.సురేష్‌కుమార్‌ హెచ్చరించారు. ఒంగోలులోని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం పిల్లల ఆరోగ్యం, ముఖచిత్ర హాజరు అమలుపై సమీక్షించారు.

Published : 23 May 2024 02:30 IST

 వైద్యశాఖ అధికారులతో సమీక్షిస్తున్న డీఎంహెచ్‌వో డి.సురేష్‌కుమార్‌ 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వైద్య, ఆరోగ్యశాఖ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డి.సురేష్‌కుమార్‌ హెచ్చరించారు. ఒంగోలులోని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం పిల్లల ఆరోగ్యం, ముఖచిత్ర హాజరు అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఆరోగ్య కార్యకర్త సకాలంలో గర్భిణులను గుర్తించి వారి వివరాలను ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. ప్రసవం, దాని అనంతరం అందించాల్సిన సేవలను విధిగా వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి ఆశా కార్యకర్త అనుమానిత దగ్గుతో బాధపడుతున్న రోగులను పరీక్ష కొరకు వారికి కేటాయించిన లక్ష్యాల మేరకు సంబంధిత ప్రయోగశాలకు పంపాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఎంవో వాణిశ్రీ, డీపీహెచ్‌ఎన్‌వో సుగుణమ్మ, డీపీవో సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని