logo

ఓపిగ్గా నిలిచి... ప్రథమంగా నిలిపి

ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటు. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యత ప్రజలదే. ఈ విషయాన్ని జిల్లా ఓటర్లు గుర్తెరిగారు. ఎప్పుడూ బద్ధకంగా ఉండే పట్టణ, నగర ఓటరు కూడా ఈ సారి ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Published : 23 May 2024 02:50 IST

ఒంగోలులో బారులు తీరిన ఓటర్లు(పాత చిత్రం) 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటు. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యత ప్రజలదే. ఈ విషయాన్ని జిల్లా ఓటర్లు గుర్తెరిగారు. ఎప్పుడూ బద్ధకంగా ఉండే పట్టణ, నగర ఓటరు కూడా ఈ సారి ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తద్వారా ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక సమరంలో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ సారి మహిళా ఓటర్లూ ఎక్కువ మందే తమ హక్కు వినియోగంలో ముందంజలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల నిర్ణయంలో అతివలే కీలకం కాబోతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లూ భారీగానే పోలయ్యాయి. ఈవీఎంలు మొరాయించినా, ఎండలు సుర్రుమన్నా.. ఓటేసీ తీరాలన్న తపనతో వెనుదిరగలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ, విదేశాల్లో ఉంటున్నవారు కూడా ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. తద్వారా గత ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్‌ శాతం పెంచారు. జిల్లాలో మొత్తం 2,183 పోలింగ్‌ కేంద్రాలుండగా.. అందులో నాలుగో వంతు కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.12 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు సాగిన సాధారణ ఎన్నికల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. 2019 ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో అత్యధికంగా నాగులుప్పలపాడు మండలంలో 5.84 శాతం ఓటింగ్‌ పెరగగా; ముండ్లమూరు, తాళ్ల్లూరు, పొన్నలూరు, కొండపి మండలాల్లో కొంత తగ్గింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని