logo
Published : 02 Dec 2021 05:36 IST

వాస్తవిక ఖర్చులతో బడ్జెట్‌ విడుదల చేయండి


డీఈవోకి వినతిపత్రం ఇస్తున్న ఎంఈవోల సంఘం ప్రతినిధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: మండల రిసోర్స్‌ కేంద్రాలకు వాస్తవ ఖర్చులతో కూడిన బడ్జెట్‌ విడుదల చేయాలని మండల విద్యాశాఖ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కిషోర్‌బాబు కోరారు. యూనియన్‌ సభ్యులతో కలసి డీఈవో విజయభాస్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. 2021-22 సంవత్సరానికి మండల రిసోర్స్‌ సెంటర్‌ కార్యాలయం ఖర్చుల కోసం రూ.75 వేల చొప్పున కేటాయిస్తున్నారన్నారు. ఏటా దాదాపు రూ.2.50 లక్షలు వ్యయమవుతుందన్నారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా కొన్ని సంవత్సరాలుగా పాత బడ్జెట్‌ కేటాయిస్తున్నారన్నారు. విద్యుత్తు బిల్లులు, సమావేశాలు, స్టేషనరీ ఇతరత్రా ఖర్చులు మొత్తం ఎంత అవుతుందనేని వివరాలు అందజేశారు. ఈ సమస్యను రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాలని డీఈవోని కోరారు. యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి బీఎన్‌ వదన్‌, చెంచుపున్నయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని