logo
Published : 03/12/2021 05:30 IST

డీఆర్వోగా శ్రీనివాసులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా రెవెన్యూ అధికారిగా పులి శ్రీనివాసులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాళ్లూరు మండలం రజానగరం గ్రామానికి చెందిన ఆయన పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ సీఈవోగా విధులు నిర్వహిస్తూ గత కొంతకాలంగా సెలవులో ఉన్నారు. తాజాగా డీఆర్వోగా నియమించారు. శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం ఇన్‌ఛార్జి డీఆర్వోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
జిల్లాలో 39 మంది ఎస్సైల బదిలీ
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో భారీ సంఖ్యలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ మలికా గార్గ్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతకొంతకాలంగా ఈ బదిలీలపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న 39 మందికి స్థానచలనం కల్పించారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని