logo
Published : 04/12/2021 05:51 IST

విభిన్న ప్రతిభావంతులకు అండ


లబ్ధిదారులకు మూడు చక్రాల సైకిళ్లు అందజేస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్,
జడ్పీ ఛైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, ఎస్పీ మలికాగర్గ్‌ 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన ఇళ్లు, పింఛన్ల వంటి సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం నిర్వహించారు. జిల్లాలో 64 వేల మందికిపైగా ఉన్నారని.. ప్రతి బుధవారం ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి జడ్పీ తరుపున అవసరమైన చర్యలు తీసుకుంటామని, తమ ట్రస్టు తరపున కూడా సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఎస్పీ మలికా గర్గ్, మేయర్‌ గంగాడ సుజాత మాట్లాడారు. జేసీ కృష్ణవేణి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఏడీ జి.అర్చన, సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస్‌ విశ్వనాథ్, స్టెప్‌ సీఈవో రవికుమార్, మైనార్టీ సంక్షేమశాఖ అధికారిణి ఝాన్సీరాణి, డీఈవో విజయభాస్కర్‌ పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.  

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని