logo

ప్రాణం విలువ తెలియని వయసు

వారిద్దరూ స్నేహితులు.. వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నారు. ద్విచక్రవాహనంపై ఒంగోలు నుంచి సరదాగా హైదరాబాద్‌ బయలుదేరారు. గుంటూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు

Published : 18 Jan 2022 02:39 IST

 బైకు చేతబట్టి బలైన బాలుడు
  మరొకరికి గాయాలు


రవికిరణ్‌ మృతదేహం

రాజుపాలెం, ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వారిద్దరూ స్నేహితులు.. వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నారు. ద్విచక్రవాహనంపై ఒంగోలు నుంచి సరదాగా హైదరాబాద్‌ బయలుదేరారు. గుంటూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న కుంచాల రవికిరణ్‌ (13), పీవీఆర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే అక్కల ప్రభాకర్‌ ప్రతి ఆదివారం ఓ ప్రార్థనా మందిరానికి వెళ్తుంటారు. ఇద్దరూ స్నేహితులయ్యారు. సోమవారం రవికిరణ్‌ రిజిస్ట్రేషన్‌ నంబరు లేని ఓ ద్విచక్ర వాహనం తీసుకుని పాఠశాలకు వెళ్తున్న ప్రభాకర్‌ వద్దకు వచ్చాడు. అనంతరం హైదరాబాద్‌ బయలుదేరారు. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద రోడ్డు విభాగినిని ఢీకొట్టారు.. వాహనం నడుపుతున్న రవికిరణ్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ప్రభాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మాచవరం 108 సిబ్బంది క్షతగాత్రుడిని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రవికిరణ్‌ మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై కె.అమీర్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అచేతనంగా పడి ఉన్న రవికిరణ్‌ను చూసి తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. 
ఎవరికీ చెప్పకుండా
చనిపోయిన రవికిరణ్‌ది ఒంగోలు వంటవారికాలనీ కాగా గాయపడ్డ ప్రభాకర్‌ది నెహ్రూనగర్‌. పాఠశాలకు వెళ్లిన తమ కుమారుడు ప్రభాకర్‌ ఎవరికీ చెప్పకుండా స్నేహితుని బండిపై వెళ్లాడని తల్లి మార్తమ్మ తెలిపారు. మధ్యాహ్నం ప్రమాదం జరిగిన విషయం తెలిసి తాము వెళ్లగా అప్పటికే నర్సరావుపేట ఆసుపత్రిలో చేర్పించారన్నారు. కాలు ఎముక విరిగిందని, తలకు బలమైన గాయాలయ్యాయని..ఒంగోలులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఘటనపై ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌ కె.భాగ్యలక్ష్మి ఆరా తీశారు. ప్రభాకర్‌ పాఠశాల విరామ (ఇంటర్వెల్‌) సమయంలో బయటికి వెళ్లి ప్రమాదానికి గురవడంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంతో మాట్లాడారు. విద్యార్థి మళ్లీ బడిలోకి వచ్చాడా లేదా అనేది పరిశీలించుకోకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. 


గాయాలతో ప్రభాకర్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని