logo

కూల్చేసిన దర్గా పునఃనిర్మాణం

అధికార పార్టీ నాయకులు కూల్చేసిన పురాతన దర్గాను తిరిగి నిర్మించేందుకు ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. పామూరు పట్టణం సి.ఎస్‌.పురం రహదారిలో... నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన మౌలా సాహెబ్‌ దర్గాను కొందరు వైకాపా నాయకులు జేసీబీతో సోమవారం కూల్చివేశారు.

Published : 25 May 2022 06:29 IST


ముస్లిం మత పెద్దలతో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసరావు

పామూరు, న్యూస్‌టుడే: అధికార పార్టీ నాయకులు కూల్చేసిన పురాతన దర్గాను తిరిగి నిర్మించేందుకు ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. పామూరు పట్టణం సి.ఎస్‌.పురం రహదారిలో... నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన మౌలా సాహెబ్‌ దర్గాను కొందరు వైకాపా నాయకులు జేసీబీతో సోమవారం కూల్చివేశారు. ఘటనపై ముస్లిం సోదరులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువూరు రోడ్డులోని మర్గస్‌ పెద్ద మసీదులో మత పెద్దలు, ముస్లిం సోదరులు మంగళవారం సమావేశమయ్యారు. దర్గాను కూల్చేసిన అధికార పార్టీకి చెందిన ముస్లిం నాయకులు... వారి తరఫున ఓ వ్యక్తిని మధ్యవర్తిగా పంపారు. కూల్చడం తప్పేనని, దర్గా స్థలంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అతడి ద్వారా తెలియజేశారు. ఆ మేరకు లిఖిత పూర్వకంగా పెద్దలకు పత్రం అందజేశారు. దీంతో నిర్మాణం ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. రాత్రి... సీఐ కె.శ్రీనివాసరావు పెద్దలతో మాట్లాడారు. అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు. ఎస్సై కె.సురేష్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని