logo

నీరు లేక అల్లాడుతున్నాం

పొదిలిలోని కాటూరివారిపాలెం బీసీకాలనీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నీటి సమస్యను పరిష్కరించాలంటూ సోమవారం ఆ ప్రాంతీయులు సీపీఎం ఆధ్వర్యంలో నగర పంచాయతీ ఎదుట ధర్నా చేపట్టారు. గతంలో నాలుగు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేవారని.. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గించడంతో కనీసం వాడుక నీరు కూడా లేక ఇబ్బందిపడుతున్నామన్నారు.

Published : 28 Jun 2022 03:22 IST

పొదిలి నగర పంచాయతీ వద్ద ఆందోళన

-న్యూస్‌టుడే, పొదిలి


నీటి సమస్యతోపాటు మౌలిక సదుపాయాల కొరతపై ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న స్థానికులు

పొదిలిలోని కాటూరివారిపాలెం బీసీకాలనీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నీటి సమస్యను పరిష్కరించాలంటూ సోమవారం ఆ ప్రాంతీయులు సీపీఎం ఆధ్వర్యంలో నగర పంచాయతీ ఎదుట ధర్నా చేపట్టారు. గతంలో నాలుగు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేవారని.. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గించడంతో కనీసం వాడుక నీరు కూడా లేక ఇబ్బందిపడుతున్నామన్నారు. ఈ మేరకు ఫ్లకార్డులు ప్రదర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.రమేష్‌ మాట్లాడుతూ డీప్‌ బోర్లకు తక్షణం మరమ్మతులు చేయించాలన్నారు. అంతర్గత రహదారులు, కాలువలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పునఃపరిశీలన పేరుతో పింఛన్లు తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. అమ్మఒడి పథకం కింద తొలగించినవారిని మరోసారి పరిశీలించి న్యాయం చేయాలన్నారు. స్థానికులు యోగయ్య, వి.రాఘవులు, బి.మోషె, బి.దేవసహాయం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని