logo

పాకల తీరం... ఆహ్లాదానికి సుదూరం

జిల్లాలోని కొత్తపట్నం, పాకల తీరాలు ముఖ్య పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. అయితే సింగరాయకొండ మండలంలోని పాకల తీరంలో అసౌకర్యాల లేమితో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని 2018 సంవత్సరంలో రూ.4 కోట్ల నిధులు కేటాయించారు.

Published : 10 Aug 2022 03:23 IST

తీరం వద్ద ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు

జిల్లాలోని కొత్తపట్నం, పాకల తీరాలు ముఖ్య పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. అయితే సింగరాయకొండ మండలంలోని పాకల తీరంలో అసౌకర్యాల లేమితో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని 2018 సంవత్సరంలో రూ.4 కోట్ల నిధులు కేటాయించారు. వాటితో స్వాగత ద్వారాలు, బీచ్‌ రోడ్లు, వీధి దీపాలు, అత్యాధునిక సౌకర్యాలతో రెస్టారెంట్‌ నిర్మాణాలు ప్రారంభించారు. అయితే వైకాపా అధికారంలోకి రాగానే పనులు నిలిపివేసింది. ఇప్పటికీ పునఃప్రారంభించకపోవడంతో బీచ్‌ పరిసరాలు అధ్వానంగా మారాయి. రూ.97 లక్షలు వెచ్చించి నిర్మాణం ప్రారంభించిన రెస్టారెంట్‌ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. దుస్తులు మార్చుకునే గదులు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. - ఈనాడు, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని