logo

ఐ ప్యాక్‌ సర్వేలన్నీ బోగస్‌

రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్‌ సర్వేలన్నీ బోగస్‌ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

Published : 27 Apr 2024 05:18 IST

నాపై అనవసరంగా వక్రీకరణ రాతలు: ఎంపీ అభ్యర్థి లావు 

రొంపిచర్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్‌ సర్వేలన్నీ బోగస్‌ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. రొంపిచర్ల మండలంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ రెండురోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో తనపై వైకాపా వారు చేస్తున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. వైకాపా సిద్ధం సభలకు రూ.700 కోట్లు ఖర్చు చేసిందని, అయినా జనం రాక గ్రాఫిక్స్‌ చేసి.. ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ కోసం పనిచేస్తున్న ఐ-పాక్‌ బృందం సర్వేలన్నీ బోగస్‌ అని, వాళ్లు చేసే ప్రచారాలన్నీ అసత్యమేనని చెప్పారు. తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తాను తన కష్టాన్ని నమ్ముకుని, పల్నాడు ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నానని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని