logo

విధుల నుంచి వాలంటీరు తొలగింపు

పామూరు-3వ సచివాలయం పరిధిలోని కొత్త నీళ్ల ట్యాంకు వీధిలో నివసిస్తున్న అంధుడు షేక్‌ మస్తాన్‌బాషాకు దివ్యాంగ పింఛను మంజూరైనప్పటికీ వాలంటీర్‌ పి.వెంకటకృష్ణ 23 నెలలుగా

Published : 05 Oct 2022 04:51 IST

అంధుడి పింఛను కాజేయడంపై స్పందించిన అధికారులు

షేక్‌ మస్తాన్‌ బాషాతో మాట్లాడుతున్న ఎంపీడీవో శ్రీనివాసులు

పామూరు: పామూరు-3వ సచివాలయం పరిధిలోని కొత్త నీళ్ల ట్యాంకు వీధిలో నివసిస్తున్న అంధుడు షేక్‌ మస్తాన్‌బాషాకు దివ్యాంగ పింఛను మంజూరైనప్పటికీ వాలంటీర్‌ పి.వెంకటకృష్ణ 23 నెలలుగా ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారు. విషయం బయటకు పొక్కడంతో రూ.69 వేలు నగదును ఈ నెల 2వ తేదీన మస్తాన్‌బాషాకు ఇచ్చారు. ఈ వివరాలను తెలుపుతూ ఈ నెల 3వ తేదిన ‘అంధుడి పింఛను కాజేసిన వాలంటీరు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎంపీడీవో వి.శ్రీనివాసులు, ఈవోఆర్డీ వి.బ్రహ్మానందరెడ్డిలు మంగళవారం మస్తాన్‌బాషా ఇంటికి వెళ్లి విచారణ చేశారు. వాలంటీరు పి.వెంకటకృష్ణను విధుల నుంచి తొలగించినట్లు వారు పేర్కొన్నారు. వారి వెంట సంక్షేమ, విద్య సహాయకుడు ఎస్డీ షరీఫ్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని