logo

నాడు అద్దం.. నేడు అధ్వానం

ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు.

Published : 18 Apr 2024 03:22 IST

ఆంధ్రుల వైభవాన్ని చాటే తెలుగుతల్లి, ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాల వద్ద సుందర చిత్రం

ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. తెలుగు తల్లి, ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలు పెట్టి ఫౌంటెన్లు ఏర్పాటుచేసి చుట్టూ పచ్చని గడ్డి పెంచారు. తెలుగువారి చారిత్రక వైభవాన్ని తెలుపుతూ పలు చిత్రాలు ఏర్పాటుచేశారు. అక్కడ నాటికలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు సైతం నిర్వహించేవారు. అయితే అయిదేళ్ల వైకాపా పాలనలో ఇదంతా ధ్వంసమైంది. మొక్కలు మాయమయ్యావి..ఫౌంటెన్‌ పాడైంది..మురుగు పారుతూ..దుర్వాసన వ్యాపిస్తూ పాలకుల వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది.

మొక్కలు మాయమై కళావిహీనంగా మారిందిలా..

చక్కని బారికేడ్లతో..

సిమెంట్‌ దిమ్మలు ధ్వంసమై

పచ్చదనం పరుచుకుని...

మురుగుమయంగా మారి...

ఈనాడు, ఒంగోలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని