logo

వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్‌పీ సీఐ ఎన్‌.శ్రీకాంత్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు.

Published : 26 Apr 2024 04:45 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్‌పీ సీఐ ఎన్‌.శ్రీకాంత్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. సంబంధిత పత్రాలు ఏమీ లేకపోవడంతో ఎన్నికల నియమావళి మేరకు వాటిని జప్తు చేశారు. 9.530 కిలోల బరువున్న వీటి విలువ రూ.అయిదు లక్షలు ఉంటుందని సీఐ శ్రీకాంత్‌బాబు తెలిపారు. నిబంధనల మేరకు జిల్లా గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించినట్లు వివరించారు.

గురువారం చేపట్టిన తనిఖీల్లో ఒంగోలు నగరానికి చెందిన విశ్రాంత సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.నటరాజ్‌ వద్ద 13 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని చెన్నైలోని సీఆర్‌ఫీఎఫ్‌ క్యాంటీన్‌ నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ఎన్నికల నియమావళి రీత్యా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం సభ్యులు ఎం.మురళి, ఎం.శ్రీనివాసరావు, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని