logo

ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 30 Apr 2024 03:33 IST

ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై చర్చిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, ఎన్నికల పరిశీలకులు  

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకులు అరవింద్‌కుమార చౌరాసియా, మయూర్‌ కె మెహతాలతో కలిసి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం పరిశీలించారు. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈవీఎంలను సురక్షితంగా భద్రపరిచేలా తరగతి గదుల్లో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్‌ వివరించారు. విద్యుత్తు ప్రమాదాలకు తావులేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి లోపాలు లేకుండా ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఫలితాలు ఎప్పటికప్పుడు తెలిపేలా ప్రత్యేక కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని