logo

తెదేపా గూటికి వైకాపా సర్పంచి

పొన్నలూరు మండలంలో సైకిల్‌ జోరు మీదుంది.  మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్‌ చిన్న మస్తాన్‌ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు.

Published : 05 May 2024 02:35 IST

సర్పంచి చిన్నమస్తాన్‌కు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నా దామచర్ల సత్య

పొన్నలూరు, న్యూస్‌టుడే: పొన్నలూరు మండలంలో సైకిల్‌ జోరు మీదుంది.  మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్‌ చిన్న మస్తాన్‌ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ చెన్నిపాడు గ్రామం సంగమేశ్వర ఆలయంలో స్వయంభు శివయ్య ఆశీస్సులతో తెదేపా అధికారంలోకి రాగానే సంగమేశ్వరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు వారం రోజులే మిగిలివున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కష్టపడి తెదేపా అభ్యర్ధి డోల బాల వీరాంజనేయ స్వామిని, ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని భారీ మెజారిటీతో  గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు అనుమోలు  సాంబశివరావు మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని