logo

వైకాపా నిర్వాకం.. మందు బాబులకూ కష్టకాలం

ఎన్నికల వేల వైకాపా అభ్యర్థులు, నేతల నిర్వాకంతో మందుబాబులకు కొత్త కష్టాలొచ్చాయి.

Published : 06 May 2024 02:16 IST

ఎన్నికల వేల వైకాపా అభ్యర్థులు, నేతల నిర్వాకంతో మందుబాబులకు కొత్త కష్టాలొచ్చాయి. ఈసీ ఆదేశాలతో ఒక్కరికి ఒక్క సీసా మాత్రమే దుకాణాల్లో విక్రయించే నిబంధన అమలవుతోంది. సగటున ఒక్కో దుకాణానికి 12 నుంచి 14 కేసులు కేటాయిస్తున్నారు. వీటిలోనూ అత్యధికం అధికార పార్టీ నేతలు, అభ్యర్థుల కోసం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందే పక్క దారి పట్టిస్తున్నారు. మిగిలిన వాటిలో ఒక్కటైనా దొరక్క పోతుందా అనే ఆశతో మందు బాబులు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఒంగోలు నగరంలోని పలు దుకాణాల వద్ద ఆదివారం కనిపించిన ఈ దృశ్యాలే అందుకు నిదర్శనం.

న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని