logo

ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ గురువారంతో ముగిసింది.

Published : 10 May 2024 01:54 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ గురువారంతో ముగిసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 8వ తేదితో ముగియగా, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మరో రోజు (గురువారం) పొడిగించారు. దీంతో ఉద్యోగులు అత్యధికంగా ఒంగోలులోని ఫెసిలిటేషన్‌ కేంద్రంలో 99.07 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే కల్పించిన ఓటుహక్కు కల్పించారు. ఉద్యోగులు అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 98.76 శాతం మంది ఓటేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని