logo
Updated : 27 Nov 2021 05:40 IST

ఎవరికీ పట్టని వేదన..!

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, గార గ్రామీణం, సారవకోట, జలుమూరు

గార గ్రామానికి చెందిన వంజల రాజేశ్వరరావు పొలమిది. ఇటీవల వర్షాలకు వరదనీరు నిల్వ ఉండిపోయింది. 1.3 ఎకరాల్లోని పంటంతా నేలకొరిగి ఇలా ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇంతవరకూ అధికారులు కన్నెత్తి చూడలేదు.

రో వారం, పది రోజుల్లో రెక్కల కష్టం చేతికి వస్తుందనుకున్నారు అన్నదాతలు.. మంచి దిగుబడులొస్తాయని అప్పుల నుంచి గట్టెక్కొచ్చని భావించారు. ఇంతలోనే గులాబ్‌ తుపాన్‌ వచ్చి సగం పంటను తుడిచిపెట్టేసింది. బాధితుల్లో కొందరికే పరిహారమిచ్చి మిగిలిన వారికి మొండిచేయి చూపించారు. తర్వాత వచ్చిన అకాల వర్షాలు పంటకు మరోసారి భారీ నష్టం మిగిల్చాయి. గత కష్టాల నుంచి కోలుకోకముందే వరుణుడు విరుచుకుపడటంతో వేల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  

రంగుమారిన ధాన్యం
స్వల్ప, మధ్యస్థ వరి రకాలన్నీ చాలావరకూ కోతలు పూర్తయ్యాయి. పంటంతా పనలు, కల్లాల్లోనే ఉంది. దీర్ఘకాలిక రకాలు గింజ గట్టిపడే దశలో ఉన్నా వర్షాల వల్ల ఫలితం లేకుండా పోతోంది. నేలకొరిగిన పంట పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. కనీసం కోత కోసేందుకు వీల్లేనంతగా నేలకు కరుచుకుంది. ఆ గింజలూ సగానికిపైగా మొలకెత్తాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిచాయి. తేమశాతం అధికం కావడంతో గింజలు ముక్కి రంగు మారాయి. ఆ ధాన్యం ఎంత ఆరబెట్టినా తేమశాతం నిబంధనల మేరకు తగ్గడం లేదు.

పరిహారమా.. పరిహాసమా..
సకాలంలో పంట నష్టం నమోదు చేయాల్సిన అధికారులు ఉదాసీనత వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం ప్రాథమిక అంచనాలు వెల్లడించలేకపోయారు. పనల మీద ఉన్న పంటకు బీమా, నష్టపరిహారం వర్తించదు. నూర్పిడి చేస్తే పంట చేతికి రాని దుస్థితి. రంగుమారిన ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో, ధర ఏమేరకు చెల్లిస్తారనే దానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో స్పష్టత ఇచ్చి, పంట కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


నష్టం గుర్తిస్తున్నాం

కాల వర్షాలతో వరి పంటకు జరిగిన నష్టాన్ని సిబ్బంది క్షేత్రస్థాయిలో గుర్తించడం ప్రారంభించారు. సామాజిక తనిఖీ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. నష్టపోయిన రైతులకు న్యాయం జరుగుతుంది. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. పూర్తి విధి విధానాలు ఇంకా వెల్లడించలేదు. అవి రాగానే రైతులకు అవగాహన కల్పించి ధాన్యం సేకరిస్తాం. ఎవరూ ఆందోళన చెందవద్దు.

- శ్రీకేష్‌ బి లఠ్కర్‌, కలెక్టరు


ఇటీవల వర్షాలకు..

ప్రభావిత మండలాలు : 19
పనల మీద ఉంది : 6,870 ఎకరాలు
కల్లాల్లో, పొలాల్లో నిల్వ చేసిన ధాన్యం : 2,320  
గింజ దశలో ఉన్నది : 4,098

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని