logo

కూతపెట్టి... రాష్ట్రస్థాయిలో రాణించి..

ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా బాలికల జట్టు రజత పతకాన్ని దక్కించుకుంది. చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం, ఆతిథ్య ప్రకాశం జట్లపై పైచేయి సాధించి తుది పోరులో కృష్ణా జిల్లా జట్టుతో తలపడింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో త్రుటిలో గెలుపు చేజారింది. రెండు దశాబ్దాల

Published : 17 Jan 2022 04:04 IST


ద్వితీయస్థానం సాధించిన జిల్లా బాలికల జట్టు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా బాలికల జట్టు రజత పతకాన్ని దక్కించుకుంది. చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం, ఆతిథ్య ప్రకాశం జట్లపై పైచేయి సాధించి తుది పోరులో కృష్ణా జిల్లా జట్టుతో తలపడింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో త్రుటిలో గెలుపు చేజారింది. రెండు దశాబ్దాల తరువాత తొలిసారిగా ఫైనల్‌కు చేరి ద్వితీయస్థానం కైవసం చేసుకున్నట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి వాసిమల్ల వీర్లెంకయ్య తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు యార్లగడ్డ వెంకన్నచౌదరి, అక్కెని చిరంజీవిరావు, ఛైర్మన్‌ ధర్మాన కృష్ణ్ణదాస్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని