logo

హతవిధీ!

తేలినీలాపురం గ్రామంలో పెలికాన్‌ పక్షుల మరణమృదంగం ఆగడం లేదు. నెల రోజులుగా మృత్యుదేవత కరాళ నృత్యం ఇక్కడ కొనసాగుతోంది. రోజుకు నాలుగైదు పక్షలు మృతి చెందుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 150కి పైగా చనిపోయినట్లు అంచనా. అటవీశాఖ అధికారులు

Published : 26 Jan 2022 05:29 IST

తేలినీలాపురం గ్రామంలో పెలికాన్‌ పక్షుల మరణమృదంగం ఆగడం లేదు. నెల రోజులుగా మృత్యుదేవత కరాళ నృత్యం ఇక్కడ కొనసాగుతోంది. రోజుకు నాలుగైదు పక్షలు మృతి చెందుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 150కి పైగా చనిపోయినట్లు అంచనా. అటవీశాఖ అధికారులు గతంలోనే పరిశీలించి కలుషిత చేపలు తినడం వల్లే మృతి చెందుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. కానీ ఎటువంటి వైద్యశిబిరమూ ఏర్పాటు చేయలేదు. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని పక్షిప్రేమికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని