logo

వైకాపాను ఓడించడమే లక్ష్యం

రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

Published : 28 Mar 2024 05:44 IST

సూపర్‌ 6 పథకాల కరపత్రాలను స్థానికులకు అందజేస్తున్న కూన రవికుమార్‌

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. మండల పరిధి షళంత్రి, చిన్నషళంత్రి గ్రామాల్లో బుధవారం తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ్వాల సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి సూపర్‌ 6 పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎత్తివేశారని విమర్శించారు. వైకాపా పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహన్‌రావు, నందివాడ గోవిందరావు, లావేటి పూర్ణారావు, కిల్లి సిద్ధార్థ, తాడేలరాజారావు, జనసేన సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు పైడి మురళీమోహన్‌, దవళ సింహాచలం, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని