logo

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.

Published : 19 Apr 2024 04:33 IST

బూర్జ, న్యూస్‌టుడే : బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. వైకుంఠపురానికి చెందిన తమ్మినేని సింహాచలం పాలసేకరణ కేంద్రానికి సైకిల్‌పై వెళ్లాడు. కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ శ్రీకాకుళం నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఉప్పినివలస వద్ద వాహనం అదుపుతప్పి సైకిల్‌ను ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు శ్రీకాకుళం మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. రమణ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దీనిపై జి.వి. ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సింహాచలం ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని అతని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు.


వ్యక్తి బలవన్మరణం

 కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: మండలంలోని చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడులో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నేతింటి రమేష్‌(36) చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. కుటుంబ తగవుల నేపథ్యంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, పిల్లలు గ్రామంలో లేకపోవడంతో వారి రాక కోసం గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. కన్నేవలస వద్ద పెట్రోల్‌ బంకులో ఇటీవలి వరకు పనిచేసిన ఇతడు హఠాత్తుగా బలవన్మరణానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.  


పాత కక్షలతో కొట్లాట.. ఇద్దరికి గాయాలు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: పాతకక్షల కారణంగా జరిగిన ఇద్దరు వ్యక్తులు గాయాలపాలైన ఘటన ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఓ కార్యక్రమం వద్ద పాతకక్షలున్న ఇద్దరి వ్యక్తుల మధ్య మాటా మాట పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఘటలో కూన కిరణ్‌, కొత్తకోట వైకుంఠరావు తీవ్రంగా గాయపడగా.. మరికొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. వీరు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అల్లర్లు జరగకుండా గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు