logo

ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు

ఇసుక అక్రమ తవ్వకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఇసుక పెళ్లలు పడి ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

Published : 20 Apr 2024 05:05 IST

ఇసుక పెళ్లలు పడి ట్రాక్టరు చోదకుడి దుర్మరణం

బాసుదేవ్‌ పాత్ర్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, చిత్రంలో ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్న సీఐ, ఎస్సై

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే : ఇసుక అక్రమ తవ్వకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఇసుక పెళ్లలు పడి ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఒడిశాలోని జగదల్‌పూర్‌కు చెందిన ట్రాక్టరు చోదకుడు బాసుదేవ్‌ పాత్ర్‌(32) బిర్లంగిలో ట్రాక్టరు యజమాని వద్ద పని చేస్తున్నారు. శుక్రవారం అక్రమంగా ఇసుక సేకరించేందుకు బాహుదానదికి వెళ్లాడు. కార్మికులతో సహా ఓ వైపు ఇసుక తవ్వుతుండగా మరో వైపు వాటి పెళ్లలు జారి అతనిపై పడ్డాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాసుదేవ్‌ నిమిషాల వ్యవధిలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ ఇమ్మాన్యుయేల్‌ రాజు, ఎస్సై లక్ష్మణరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమతుల్లేకుండా తవ్వకాలు చేపడుతున్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఫలితంగా ప్రాణాలు పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని