logo

ఇవేం ఏర్పాట్లు?

శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఆదివారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్ ఓటింగ్‌ ప్రక్రియ గందరగోళంగా సాగింది.

Published : 06 May 2024 02:49 IST

నరసన్నపేట: పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్ల తాకిడి

శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఆదివారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్ ఓటింగ్‌ ప్రక్రియ గందరగోళంగా సాగింది. ఓటర్లకు సరైన సమాచారం ఇవ్వకపోవడం, ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో ఉద్యోగులకు ఆపసోపాలు తప్పలేదు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో తొలిరోజు ఎలాంటి షరతులు లేకుండానే పోలింగ్‌ జరిపారు. ఆదివారం సెల్‌ఫోన్లు తీసుకురావద్దని ఆంక్షలు పెట్టడంతో ఫోన్లు తెచ్చినవారు కేంద్రానికి వెళ్లే మెట్ల వద్ద నేలపై పడేసి వెళ్లారు. నరసన్నపేటలో తాగునీటి సమస్య ఎదురైంది. కేంద్రం వద్ద మహిళలు ఎండలో క్యూలైన్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది. రెండో రోజు 8 నియోజకవర్గాల పరిధిలోని 10,448 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీకాకుళంలో అత్యధికంగా 2,059, ఎచ్చెర్లలో అత్యల్పంగా 851 మంది ఓటేశారు.

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం), నరసన్నపేట

శ్రీకాకుళంలో సెల్‌ఫోన్లు వెతుక్కుంటున్న ఉద్యోగులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని