logo

నీరు గారిన పథకం

ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకాల నిర్వహణ ఐదేళ్లుగా గాలికి వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Published : 07 May 2024 04:39 IST

న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం, ఇచ్ఛాపురం

ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకాల నిర్వహణ ఐదేళ్లుగా గాలికి వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కవిటి మండలంలోని తాగునీటి వనరులు లేకపోవడంతో ఉద్దానం నీటి సరఫరా భాగంలో మండలంలోని 23 పంచాయతీల్లో 36 గ్రామాల్లో ఉద్దానం, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూఎస్‌ పథకాల్లో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించారు. అవి శిథిలమవుతున్నాయి. ముఖ్యంగా మండలంలో మత్స్యకార గ్రామాల్లో నిర్మించిన ట్యాంకులు సముద్రం నుంచి వీచే ఉప్పుగాలి వలన త్వరగా పాడవుతున్నాయి.

ఉద్దానం నీటి సరఫరా పథకంలో భాగంగా జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో వీరి అవసరాలకు తగ్గట్టుగా గతంలో భారీ ట్యాంకులు నిర్మించారు. అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్యాంకు పైకి చేరుకునే సిమెంటు మెట్లన్నీ విరిగిపోయాయి. ఇనుముతో వేసిన మెట్లు తుప్పు పట్టి పోయాయి. కొన్నిట్యాంకుల స్తంభాలు బీటలు వారుతున్నాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఇందులో కొన్ని పథకాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మారుతుండగా, వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిపై దృష్టి సారించి ట్యాంకులకు మరమ్మతులు చేయిస్తే మేలు జరుగుతుంది. శిథిలావస్థలో ఉన్న గ్రామాల్లోని ట్యాంకులు పరిశీలించి వాటికి మరమ్మతులు చేయాలని నీటి వనరులు పునరుద్ధరించాలని కోరుతున్నారు.


పొంచి ఉన్న ప్రమాదం

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం మండల పరిధి బిర్లంగి గ్రామం మధ్యలో ఉన్న తాగు నీటి పథకానికి అమర్చిన ఇనుప నిచ్చెన శిథిలావస్థకు చేరుకుంది. 60 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ట్యాంకు ప్రస్తుతం వినియోగంలోనే ఉంది. నిచ్చెన తుప్పు పట్టి విరగడంతో ఏ క్షణంలో కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని