logo

కమ్యూనిస్టు యోధుడు శ్రీరాములు కన్నుమూత

మండల పరిధి నగరంపల్లిలో సోమవారం తొలితరం కమ్యూనిస్టు యోధుడు బమ్మిడి శ్రీరాములు (91) అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు 70 ఏళ్ల పాటు కమ్యూనిస్టు భావజాలంతో కొనసాగారు.

Published : 07 May 2024 04:56 IST

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: మండల పరిధి నగరంపల్లిలో సోమవారం తొలితరం కమ్యూనిస్టు యోధుడు బమ్మిడి శ్రీరాములు (91) అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు 70 ఏళ్ల పాటు కమ్యూనిస్టు భావజాలంతో కొనసాగారు. యువజన, గిరిజన, కార్మిక, రైతు సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తూ వారి హక్కుల కోసం పోరాడారు. 90 సంవత్సరాల వయసులోనూ భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్కిస్ట్‌) సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్న నిబద్ధత ఆయనది. నగరంపల్లి కేంద్రంగా పలాస ప్రాంతంలో అనేక ప్రజా సంఘాలు నిర్మించి ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ఇటీవల జరిగిన జీడి రైతుల పోరాటం వరకు అనేక ప్రజా ఉద్యమాల్లో స్ఫూర్తిదాయకంగా పని చేశారు.

ఆరేళ్లు అజ్ఞాత వాసం, రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ముగ్గురు కుమారులు కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారు. శ్రీరాములు భౌతికకాయంపై ప్రజా సంఘాల నాయకులు సీపీఎం జెండా కప్పి నివాళులర్పించారు. నేటి తరానికి ఆయన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, నాయకులు దువ్వాడ వెంకటకుమార్‌ చౌదరి, సన్యాసిరావు, మాధవరావు, మోహనరావు, త్రిలోచనరావు తదితరులు సంతాపం తెలిపారు. అంతిమ యాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని