logo

ప్రభుత్వ పథకాలపై ఎన్నికల సంఘం పెత్తనమేంటి?

రాష్ట్రంలో అయిదేళ్లుగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ఎన్నికల సంఘం పెత్తనమేంటని ఎమ్మెల్సీ, వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. టెక్కలిలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 08 May 2024 05:17 IST

ఈసీపై దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు

మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్‌

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదేళ్లుగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ఎన్నికల సంఘం పెత్తనమేంటని ఎమ్మెల్సీ, వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. టెక్కలిలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు కేంద్రంలో ఉన్న భాజపాతో చేతులు కలిపి ఎన్నికల సంఘాన్ని ప్రలోభపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు చెల్లింపులు నిలిపివేయించిన ఈసీ తెలంగాణలో మాత్రం కొత్త పథకాలకు నిధులెలా విడుదల చేయిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పక్షపాత నిర్ణయంతో ఈబీసీ నేస్తం, జగనన్న విద్యాకానుక, చేయూత, ఆసరా, పెట్టుబడి రాయితీ పథకాలకు చెల్లింపులు నిలిచిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎన్నికల సంఘం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించట్లేదనే అనుకుంటున్నట్లు చెప్పారు. ఇలా అయితే ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు