logo

నెలకు రూ.4,000 పింఛను

తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్‌సిక్స్‌ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పలాస, ఇచ్ఛాపురం అభ్యర్థులు శిరీష, అశోక్‌ తెలిపారు. రెండు నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు.

Published : 10 May 2024 06:17 IST

న్యూస్‌టుడే, సోంపేట, కవిటి గ్రామీణం, వజ్రపుకొత్తూరు, వజ్రపుకొత్తూరు గ్రామీణం, ఇచ్ఛాపురం, కంచిలి

గుణుపల్లిలో భారీ ర్యాలీగా వెళుతున్న గౌతు శిరీష

తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్‌సిక్స్‌ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పలాస, ఇచ్ఛాపురం అభ్యర్థులు శిరీష, అశోక్‌ తెలిపారు. రెండు నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు పలు గ్రామాల్లో సూపర్‌-6 వల్ల ప్రయోజనాలను వివరించారు. పింఛను నెలకు రూ.4000, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి వాటి గురించి ప్రజలకు తెలిజేశారు.


వాలంటీర్ల చేరిక

కవిటి గ్రామీణం, పలాస, సోంపేట, న్యూస్‌టుడే: నెలవంక పంచాయతీ నుంచి గ్రామ వాలంటీరు మేఘనాథం, కొమ్ముపుట్టుగ గ్రామం నుంచి మాధవ్‌తోపాటు పలువురు తెదేపాలో చేరారు. దీంతోపాటు బెజ్జిపుట్టుగ పంచాయతీలోని బొగిడియాపుట్టుగ గ్రామం నుంచి 50 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

  • పలాస తెదేపా కార్యాలయంలో పురుషోత్తపురానికి చెందిన వైకాపా నాయకుడు సప్ప.మన్మథరావు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న మందస మండలం బొగాబందకు చెందిన బి.శ్రీనివాస్‌రావు తెదేపాలో చేరారు.

సోంపేట : కొర్లాంలో తెదేపా ప్రచారం 206

  • సోంపేట కళింగకోమటి సంఘం తెదేపాకు మద్దతు తెలిపింది. సోంపేటలో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రతినిధులు బి.గోవిందరాజులు, ఎల్‌.శ్రీను తదితరులు హాజరయ్యారు. అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌ మాట్లాడుతూ వ్యాపారుల ప్రయోజనాలు కాపాడతామన్నారు.

సోదరి ఇదే మన గుర్తు

ఊరువాడా ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. పార్టీ నాయకులు ప్రతి ఒక్కరిని కలిసి జరగబోయే అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. పట్టణంలోని 11వ వార్డులో జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఆశి లీలారాణి ప్రచారం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు ఓటువేసే విధానంపై అవగాహన కలిగించారు.

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని