logo

యథార్థ ఘటన ఆధారంగా చిత్రం

కౌశల్‌ క్రియేషన్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న క్రైం, థ్రిల్లర్‌ చిత్రం ‘నాన్‌ యార్‌’. ఆంధ్రాలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్‌ కోలా భాస్కర్‌ కుమారుడు బాలకృష్ణ హీరోగా పరిచయమవుతున్నారు.

Published : 27 Sep 2022 01:24 IST

‘నాన్‌ యార్‌’లో ఓ దృశ్యం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: కౌశల్‌ క్రియేషన్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న క్రైం, థ్రిల్లర్‌ చిత్రం ‘నాన్‌ యార్‌’. ఆంధ్రాలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్‌ కోలా భాస్కర్‌ కుమారుడు బాలకృష్ణ హీరోగా పరిచయమవుతున్నారు. సాక్షి చౌదరి కథానాయిక. బాహుబలి ప్రభాకర్‌ విలన్‌పాత్ర పోషిస్తున్నారు. నీరజ, తనిష్క్‌రాజన్‌లు ఇతర తారాగణం. పల్నాటి నిర్జన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శక్తి సంగీతం సమకూర్చుతున్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ పత్రికల్లో వస్తున్న సీరియల్‌ కిల్లర్‌ గురించి కథానాయకుడు వివరాలు సేకరిస్తాడు. ఆ క్రమంలో ఓ ముఠా కథానాయికను కిడ్నాప్‌ చేస్తుంది. తర్వాత పోలీసుల దర్యాప్తు, కథానాయకుడి వెతుకులాటే మిగిలిన కథ’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని