హరితాభివృద్ధికి కృషి అవసరం
పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత అందరిదని, ప్రైవేటు సంస్థలు మొక్కలు నాటి కాపాడాలని గవర్నర్ ఆర్.ఎన్.రవి సూచించారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్ ఆర్.ఎన్.రవి
ఆవడి, న్యూస్‌టుడే: పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత అందరిదని, ప్రైవేటు సంస్థలు మొక్కలు నాటి కాపాడాలని గవర్నర్ ఆర్.ఎన్.రవి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకుని తిరువళ్ళూరు జిల్లా ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి చెందాలంటే సైనిక రంగం మిక్కిలి బలంగా ఉండాలన్నారు. మొక్కలు నాటి పెంచడం ఒక్క ప్రభుత్వంతోనే సాధ్యం కాదని... ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలని పేర్కొన్నారు. అప్పుడే దేశంలో పచ్చదనం అతివేగంగా అభివృద్ధి చెంది భూతాపం నుంచి భూమిని కాపాడుకోగలుగుతామన్నారు. అనంతరం జవానులతో మాట్లాడి వారి సేవలను ప్రశంసించారు. మహిళా కార్మికులకు మాస్టర్‌మైండ్ ట్రస్టు తరపున కుట్టు యంత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత