logo

పోలీసులు స్వతంత్రంగా పనిచేస్తే నిందితులను గంటలో గుర్తిస్తారు

తిరునెల్వేలి కాంగ్రెస్‌ అధ్యక్షుడిది హత్యా లేదా ఆత్మహత్య అని ఇంకా తేలలేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ అన్నారు.

Published : 08 May 2024 00:02 IST

ఆర్బీ ఉదయకుమార్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తిరునెల్వేలి కాంగ్రెస్‌ అధ్యక్షుడిది హత్యా లేదా ఆత్మహత్య అని ఇంకా తేలలేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ అన్నారు. పోలీసులను స్వతంత్రంగా పనిచేయనిస్తే నిందితులను గంటలో గుర్తిస్తారని చెప్పారు. మదురైలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎంకే ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిందన్నారు. మూడేళ్లలో జనం విద్యుత్తు ఛార్జీల పెంపు, ఆస్తి పన్ను, పాలు, నిత్యావసర వస్తువుల పెరుగుదల అని 30 ఏళ్ల భారం మోస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రశ్నార్థకం అయిందన్నారు. అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు మొదటిస్థానంలో ఉందన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలు పెంచమని చెప్పారని ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. నీట్‌ పరీక్ష, విద్యారుణం రద్దు కూడా అదే కోవలోకి చేరుతాయన్నారు. రూ.1000 ఇంకా కోటి మందికిపైగా అందాల్సి ఉందని గుర్తు చేశారు. డీఎంకే ప్రభుత్వం ప్రజలకు మోసాన్ని బహుమతిగా ఇచ్చిందన్నారు. వారిని నమ్మేందుకు జనం సిద్ధంగా లేరన్నారు. ఎడప్పాడి పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు