logo

జయకుమార్‌ లేఖలో అంశాలు అవాస్తవం

తిరునెల్వేలి తూర్పు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జయకుమార్‌ ధనసింగ్‌ మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.

Published : 08 May 2024 00:06 IST

టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు

మద్దతుదారులతో మాట్లాడుతున్న తంగబాలు

టీనగర్‌, న్యూస్‌టుడే: తిరునెల్వేలి తూర్పు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జయకుమార్‌ ధనసింగ్‌ మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఆయన రాసినట్లుగా పేర్కొన్న లేఖలను ఫోరెన్సిక్‌ అధికారులు పరిశీలించారు. రెండింటిలోనూ ఆయన చేతిరాతే ఉన్నట్లు నిర్ధారించారు. డబ్బు లావాదేవీల వ్యవహారంలో టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, నాంగునేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రూబి మనోహరన్‌తో పాటు మరికొంది పేర్లు లేఖల్లో ఉన్నాయి. వారిని విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు సమన్లు పంపారు. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణకు హాజరైన అనంతరం తంగబాలు విలేకర్లతో మాట్లాడారు. జయకుమార్‌ తనకు రూ.11 లక్షలు ఇచ్చారని, ఆ మొత్తాన్ని రూబి మనోహరన్‌ నుంచి తీసుకోవాల్సిందిగా ఆయనకు తాను సూచించినట్లు లేఖలో ఉందన్నారు. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. జయకుమార్‌ మృతిపై కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు