logo

ఆత్మహత్యలు అడ్డుకునేందుకు ట్రాక్టర్ల అందజేత

అప్పుల బాధ భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడటాన్ని అడ్డుకోవడానికే ట్రాక్టర్లు అందిస్తున్నట్లు ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ పేర్కొన్నారు.

Published : 08 May 2024 00:12 IST

నటుడు రాఘవ లారెన్స్‌

మాట్లాడుతున్న రాఘవ లారెన్స్‌

వేళచ్చేరి, న్యూస్‌టుడే: అప్పుల బాధ భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడటాన్ని అడ్డుకోవడానికే ట్రాక్టర్లు అందిస్తున్నట్లు ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ పేర్కొన్నారు. ‘సేవయే కడవుల్‌’ ట్రస్ట్‌ ప్రారంభించిన ఆయన మార్పు పేరిట అన్నదాతలకు ట్రాక్టర్‌ అందించే కార్యక్రమాన్ని మైలాడుదురై జిల్లా తిల్లయాడిలో మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు అప్పులబాధ భరించలేక బలవన్మరణాలకు పాల్పడటం తనను కలచివేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు