logo

ముఖ్యమంత్రితో విద్యార్థులు

రాష్ట్రంలో సోమవారం విడుదలైన 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నగరానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ నివేద, నాంగునేరిలో కులవివక్షకు గురైన చిన్నదురై మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు.

Published : 08 May 2024 00:14 IST

ముఖ్యమంత్రిని కలిసిన విద్యార్థులు

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సోమవారం విడుదలైన 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నగరానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ నివేద, నాంగునేరిలో కులవివక్షకు గురైన చిన్నదురై మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు. విద్యార్థులను అభినందించి తిరుక్కురళ్‌ పుస్తకాలు, పెన్నులను సీఎం కానుకగా అందించారు. వెంట పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్‌దాస్‌ మీనా, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కుమరగురుభరన్‌, సంచాలకులు అరివొళి, తిరునెల్వేలి జిల్లా విద్యాధికారి ముత్తుసామి ఉన్నారు. సచివాలయం ప్రాంగణంలో విలేకర్లతో విద్యార్థి చిన్నదురై మాట్లాడుతూ.. ఎక్కువ మార్కులు పొందినందుకుగాను ముఖ్యమంత్రి పిలిపించి అభినందించారని తెలిపారు. మంత్రి అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి కూడా అభినందించారని పేర్కొన్నారు. సీఏ చదవాలన్నది ఆశయమని, సహాయం అందించనున్నట్టు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. కులవివక్షతో దాడికి పాల్పడిన విద్యార్థుల గురించి పాత్రికేయులు ప్రశ్నించగా... అందరూ ఐక్యతతో ఉండాలని, తనపై దాడికి పాల్పడిన విద్యార్థులూ బాగా చదివి వృద్ధిలోకి రావాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు