logo

జారవిడుచుకున్న బ్యాగు అప్పగింత

మదురై సెంట్రల్‌ జైలు తరఫున నిర్వహిస్తున్న హోటల్‌లో ప్రతిరోజు చాలా మంది ఆహారం తిని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వెటర్నరీ డాక్టర్‌ శ్రీనివాస్‌, అతని భార్య శ్రీ గంగాలు కుటుంబంతో కలిసి తమిళనాడును సందర్శనకు వచ్చారు.

Published : 09 May 2024 00:42 IST

నిజాయతీ చాటిన ఖైదీ

చేతి సంచి అప్పగిస్తున్న పోలీసులు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: మదురై సెంట్రల్‌ జైలు తరఫున నిర్వహిస్తున్న హోటల్‌లో ప్రతిరోజు చాలా మంది ఆహారం తిని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వెటర్నరీ డాక్టర్‌ శ్రీనివాస్‌, అతని భార్య శ్రీ గంగాలు కుటుంబంతో కలిసి తమిళనాడును సందర్శనకు వచ్చారు. మదురైలోని ముఖ్య పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అనంతరం సెంట్రల్‌ జైలు నిర్వహిస్తున్న హోటల్లో అల్పాహారం తిని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అప్పుడు వారు హ్యాండ్‌ బ్యాగు మరచిపోవడాన్ని గమనించిన అక్కడ పనిచేసే ఓ ఖైదీ దానిని జైలు అధికారులకి అప్పగించాడు. అందులో నగదు, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. అనంతరం దర్యాప్తు చేసి మదురై పరిధి జైలుశాఖ డీఐజీ పళని, సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ సతీష్‌కుమార్‌ వారికి బ్యాగుని అప్పగించారు. అది తీసుకున్న వారు జైలు అధికారులను, ఖైదీ నిజాయతీని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని