logo

లండన్‌లో కుమారుడితో ఉదయనిధి సందడి

లండన్‌లో కుమారుడు ఇన్బనిధితో మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఉల్లాసంగా గడుపుతున్నారు.

Published : 10 May 2024 00:57 IST

కుమారుడు ఇన్బనిధితో ఉదయనిధి
సైదాపేట, న్యూస్‌టుడే: లండన్‌లో కుమారుడు ఇన్బనిధితో మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పూర్తిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితి ఉంది. దీంతో మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ 10 రోజుల పర్యటనగా లండన్‌ వెళ్లారు. వారం క్రితం చెన్నై నుంచి బయల్దేరి వెళ్లారు. విమాన ప్రయాణ సమయంలో తన కుమార్తెతో తీసుకున్న ఫొటో విడుదల చేయగా ప్రస్తుతం లండన్‌లో కుమారుడు ఇన్బనిధితో ఉల్లాసంగా గడుపుతున్న ఫొటోను గురువారం పోస్టు చేశారు. శుక్రవారం చెన్నైకి తిరిగొస్తారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు