logo
Published : 28/11/2021 04:03 IST

అప్పన్న సన్నిధి.. భక్తజన పెన్నిధి

సింహగిరి మాడవీధుల్లో భక్తులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి కొలువైన సింహగిరి శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. కార్తిక మాసం, వారాంతం కావడంతో ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉచిత, శీఘ్ర దర్శనం, మాడవీధుల్లో జోడుభద్రాల వరకు క్యూలైన్లు విస్తరించాయి. సరైన నీడ, మరుగుదొడ్లు లేక భక్తులు ఇబ్బందిపడ్డారు. మధ్యాహ్నం దర్శనాలు నిలిపివేసే సమయంలో రూ.100 శీఘ్ర దర్శనం క్యూలైను వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. 8,704 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 25 వేల మంది స్వామిని దర్శించుకున్నారు. రూ.100 శీఘ్ర దర్శనం టిక్కెట్లు 10,366, రూ.300 అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లు 3,752 అమ్ముడయ్యాయి. దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.21.38 లక్షలు, తలనీలాల ద్వారా రూ.2.15 లక్షలు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.7.36 లక్షలు, టోల్‌గేటు ద్వారా రూ.77వేలు ఆదాయం సమకూరింది.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని