logo
Updated : 02 Dec 2021 04:50 IST

లారీ ఢీ.. యువ ఇంజినీర్‌ దుర్మరణం

దీపక్‌ అవినాష్‌ (దాచిన చిత్రం)

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: వారంతా విశాఖ నగరంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన డిప్లమో పూర్తిచేసిన పూర్వ విద్యార్థులు. బుధవారం ఉదయం మన్యంలో ప్రకృతి అందాలను తిలకించారు. సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణమై మరో గంటలో విశాఖ చేరుకుంటారనగా ఇంతలో విషాదం చోటుచేసుకుంది. వీరిలో ఓ యువకుడిని లారీ మృత్యువు రూపంలో కబళించింది.

లారీ కింద దీపక్‌ అవినాష్‌ మృతదేహం

విశాఖలోని కంచరపాలెం, ఎన్‌జీఎస్‌ కాలనీకి చెందిన చలుమూరి దీపక్‌ అవినాష్‌ (22), డి.లక్ష్మణ్‌ తరుణ్‌, కె.నిఖిల్‌్, కె.పవన్‌, కె.దినేష్‌, ఆర్‌.వెంకటేష్‌ కొమ్మాదిలో ఇంజినీరింగ్‌ చదువుకున్నారు. మూడు ద్విచక్ర వాహనాలపై ఏజెన్సీలోని వంజంగి, కొత్తపల్లి జలాశయం, లంబసింగి ప్రాంతాలను సందర్శించారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. చోడవరం వేంకటేశ్వరస్వామి ఆర్చీ వద్దకు చేరుకునే సమయానికి డి.లక్షణ్‌ తరుణ్‌, దీపక్‌ అవినాష్‌ ప్రయాణిస్తున్న స్కూటీని వడ్డాది నుంచి సరుగుడు లోడుతో వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనుక కూర్చున్న అవినాష్‌ అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఇతనిని లారీ కొంతదూరం ఈడ్చుకొని వెళ్లడంతో సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. స్కూటీ నడుపుతున్న లక్ష్మణ్‌తరుణ్‌ గాయాలతో సృహ తప్పి పడిపోయాడు. ఇతనిని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని