logo
Published : 02/12/2021 04:34 IST

వృద్ధురాలి మెడలో బంగారం చోరీకి యత్నం

పోలీసులకు అప్పగించిన స్థానికులు

యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గోపాలపట్నం, న్యూస్‌టుడే: గంజాయి, మద్యానికి బానిసైన యువకులు చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. వృద్ధురాలి మెడలో బంగారం గొలుసును చోరీకి యువకుడు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన ఘటన బుధవారం గోపాలపట్నంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంవీపీ కాలనీకి చెందిన తలాబత్తుల కౌసల్యదేవి(68) భర్త నారాయణరావుతో కలిసి జీవీఎంసీ 89వ వార్డు భగత్‌సింగ్‌నగర్‌లో నివాసముంటున్న అల్లుడు ఇంటికి మంగళవారం వచ్చారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భర్తతో కలిసి ఆమె ఉదయపు నడకకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుని ముంగిట గేటు తీస్తున్న తరుణంలో అక్కయ్యపాలేనికి చెందిన ఎర్ల వినయ్‌కుమార్‌(22) వెనుక నుంచి వచ్చి మెడలోని బంగారం వస్తువులు తెంపడానికి ప్రయత్నించగా.. చేతికి పుస్తెలుతాడు వచ్చింది. మెడలో ఇంకా నల్లపూసలతాడు ఉండిపోయిందని వెనక్కివెళ్లి లాగే ప్రయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో పరుగు తీశాడు. అప్పటికే తనతోపాటు ద్విచక్రవాహనంతో వచ్చిన మరో ఇద్దరు యువకులు వాహనాన్ని కదిలించగా.. దాన్ని ఎక్కేందుకు వెళ్లిన వినయ్‌కుమార్‌ జారిపడ్డాడు. దీంతో వృద్ధిరాలి మనవరాలు అకోజు మానస అప్రమత్తమైంది. యువకుడిని పట్టుకోగా నివాసితుల సాయంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటానాస్థలానికి చేరుకున్న గోపాలపట్నం క్రైం పోలీసులు 2 తులాల పుస్తెలతాడును చోరుడి నుంచి స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. నగరంలోని వెలంపేటకు చెందిన మిగతా ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. క్రైం ఎస్సై ఆధ్వర్యంలో హెచ్‌సీ ఎం.శామ్యూల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శెభాష్‌ మానస: చోరులను పట్టుకోవడంలో మానస కీలకపాత్ర పోషించింది. ఇంటి బయట తన అమ్మమ్మ కేకలు పెట్టగానే అప్రమత్తతమై భయపడకుండా దొంగను ఛేదించేందుకు పరుగులు తీసింది. అతను చేతిలో ఉన్న కత్తిని చూపించినా భయపడలేదు. తనను వదలేకపోతే గొంతు కోసుకుంటానని దొంగ మభ్యపెట్టినప్పటికీ మానస పట్టువీడలేదు. ఆమె చేసిన సాహసాన్ని స్థానికులు, పోలీసులు అభినందించారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని