logo
Published : 04/12/2021 02:25 IST

అనుక్షణం అప్రమత్తం

రాజవరంలో మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్న మెరైన్‌ పోలీసులు

నక్కపల్లి, పాయకరావుపేట గ్రామీణం, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: జవాద్‌ తుపాను నేపథ్యంలో అధికారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామాల్లో తిరుగుతూ సూచనలు చేస్తూనే, అత్యవసరమైతే గ్రామాల్లో శిబిరాలు పెట్టి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. తీనార్ల, దొండవాక, రాజయ్యపేట, బోయపాడు, డీఎల్‌పురం, బంగారమ్మపేట తదితర గ్రామాలకు చెందిన మత్స్యకారులంతా తీరం వద్దకు వెళ్లి వలలు, తెప్పలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. విద్యాశాఖ ఆదేశాలతో ఉపాధ్యాయులు పాఠశాలలకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి సెలవు ఇవ్వడంతో విద్యార్థులకు ఇళ్లకు వెళ్లిపోయారు. నక్కపల్లి తహసీల్దారు రమణ తుపాను రక్షిత భవనాలను పరిశీలించి, తాగునీరు, విద్యుత్తు, అవసరమైతే జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. సమీప పాఠశాలల ఉపాధ్యాయుల నుంచి వీఆర్వోలు తాళాలు తీసుకున్నారు. నక్కపల్లి మండలంలోని అన్ని పంచాయతీలకు తుపాను పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు తహసీల్దారు పేర్కొన్నారు. పెంటకోట మెరైన్‌ పోలీసులు తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. మెరైన్‌ సీఐ నారీమణి బృందం పెంటకోట, రాజనగరం, పాల్మన్‌పేట, వెంకటనగరం తదితర ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేలా హోంగార్డులను నియమించారు.

రేవుపోలవరం, బంగారమ్మపాలెం గ్రామాల్లో మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. సీఐ నారాయణరావు, మెరైన్‌ సిబ్బందితో రేవుపోలవరం తీరాన్ని పరిశీలించారు. ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలోని 25 కిలోమీటర్ల మేర తీరం ప్రాంతంలో సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని