logo
Published : 04/12/2021 03:05 IST

సింహాద్రి రెండో యూనిట్‌లో విద్యుదుత్పత్తి పున:ప్రారంభం

పరవాడ, న్యూస్‌టుడే: సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో విద్యుదుత్పత్తిని పునః ప్రారంభించారు. 500మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబులకు లీకులు ఏర్పడడంతో బుధవారం ఉదయం ఉత్పత్తిని నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. సంస్థ ఉద్యోగులు, కార్మికులు శ్రమించి శుక్రవారం మరమ్మతులు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా మొదటి యూనిట్‌ను వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగా సుమారు నెలరోజుల రోజుల క్రితం షట్‌డౌన్‌ చేశారు. ప్రస్తుతం ఆ పనులు పూర్తి కావడంతో యూనిట్‌ను లైటప్‌ చేసి విద్యుదుత్పత్తిని పునః ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని